Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Mann Ki Baat | నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్ (Mann Ki Baat)' పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం తనకు ఒక 'తీర్థయాత్ర (Pilgrimage)' లాంటిదని, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సామాన్యులు చేస్తున్న అసాధారణమైన కృషిని గౌరవించుకునే మార్గమని అన్నారు.
Mann Ki Baat : నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్ (Mann Ki Baat)’ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం తనకు ఒక ‘తీర్థయాత్ర (Pilgrimage)’ లాంటిదని, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సామాన్యులు చేస్తున్న అసాధారణమైన కృషిని గౌరవించుకునే మార్గమని అన్నారు. ఇవాళ ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచి స్ఫూర్తినిచ్చిన శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పన్నెండేళ్ల క్రితం విజయదశమి పర్వదినాన మనం ‘మన్ కీ బాత్’ ప్రారంభించామని, అప్పటి నుంచి మన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రధాని గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో మీరంతా సహ ప్రయాణికులుగా, స్ఫూర్తిదాతలుగా ఉన్నారని శ్రోతలను ఉద్దేశించి అన్నారు. శతాబ్దాలుగా మన దేశంలో తీర్థయాత్రల సంప్రదాయం ఉందని, దేశ ప్రజల కృషిని దగ్గర నుంచి అర్థం చేసుకోవడానికి, వారి సేవలకు వందనం చేయడానికి ‘మన్ కీ బాత్’ తనకు ఒక తీర్థయాత్ర కన్నా తక్కువేమీ కాదని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం జీవించే వ్యక్తులు స్వయంగా పుణ్యక్షేత్రాల వంటివారని ప్రధాని కొనియాడారు.
దేశంలోని సామాన్య ప్రజల కృషినీ, ధైర్యాన్ని, అంకితభావాన్ని, సేవా స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ‘మన్ కీ బాత్’ ఒక అద్భుతమైన అవకాశమని ప్రధాని అన్నారు. ఈ పన్నెండేళ్లలో సమాజం దృష్టికి రాని ఎందరో మహానుభావుల అసాధారణమైన పనులను ఈ కార్యక్రమం ద్వారా దేశం ముందుంచామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా తాను ఒకరకంగా మన దేశ ప్రజల శక్తికి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. దేశంలోని ప్రతి కుటుంబంతోనూ అనుబంధం పెంచుకునే అవకాశం నాకు లభించిందని చెప్పారు.
చాలామంది ప్రజలు తనకు సందేశాలు పంపుతూ.. ‘మన్ కీ బాత్’ వింటున్నప్పుడు, తమ మధ్యలో ఒక కుటుంబసభ్యుడిగా కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని చెబుతుంటారని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. “శ్రోతలైన మీ అందరి ఆత్మీయత, అనురాగం నాకు నిజంగా అమూల్యమైన ఆస్తి” అని ప్రధాని భావోద్వేగంగా అన్నారు. తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌లలో ప్రసారమైంది. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

