Mann Ki Baat : దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబుల (GST slabs) లో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మన్‌కీ బాత్ 127వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు. జీఎస్టీ మార్పులవల్ల ఈ సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయన్నారు.
వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చిందని ప్రధాని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో గార్బేజ్ కేఫ్ వినూత్నంగా పర్యావరణానికి సేవలు అందిస్తోందని తెలిపారు. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి ఫుల్ మీల్స్ తినొచ్చు. మీరు కిలో వ్యర్థాలు ఇస్తే.. లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. అదే అరకిలో ఇస్తే అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్‌ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోందని ప్రధాని అభినందించారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుపుకుంటున్న ఛాత్‌పూజ మహోత్సవం గురించి, మావోయిస్టుల గురించి కూడా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు.