Self Driving Ship: కృత్రిమ మేధతో నడిచే కార్లు, బైకుల గురించి ఇప్పటిదాకా విన్నాం కదా..! తాజాగా మనిషి సాయం లేకుండా ఓ కార్గో షిప్ ఏకంగా 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లింది. 40 గంటల పాటు ప్రయాణించింది. అది కూడా చాలా సన్నటి టోక్యోబే మీదుగా వెళ్లింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓర్కా ఏఐ కంపెనీ రూపొందించిన సాంకేతికత సాయంతో ఇది సాధ్యపడింది.
కృత్రిమ మేధ సాయంతో ఓ కార్గో షిప్ ఇంతదూరం ప్రయాణించడం ప్రపంచంలోనే ఇది తొలిసారని చెబుతున్నారు. ఓడకు సుజాకా అని పేరు పెట్టారు. మార్గమధ్యలో సుజాకాకు ఎదురుగా 500 వేరే ఓడలు వచ్చాయి. 107 సార్లు వేరే వాటిని ఢీకొనే అవకాశం ఉన్నా.. తప్పించుకుని ముందుకు సాగింది.