Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు. సిసోడియా కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో ఆయనను హాజరుపర్చారు.
కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున సిసోడియాకు మరికొన్ని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. దాంతో సిసోడియా కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 10 రోజులు పొడిగించింది. దాంతో ఆయన ఈ నెల 15 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉండి విచారణ ఎదుర్కొంటున్నారు.
#WATCH | Delhi Excise policy CBI case | Delhi former Dy CM and AAP leader Manish Sisodia produced in the Rouse Avenue Court. pic.twitter.com/G9WAELwCJO
— ANI (@ANI) July 6, 2024