న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ అభ్యర్థనపై ఇవాళ జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సుప్రీం న్యాయమూర్తి(Supreme Court Judge)గా ఉన్న సంజయ్ కుమార్ .. ఆ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే కొత్త బెంచ్ ముందుకు వెళ్లిన ఆ కేసును .. జూలై 15వ తేదీకి విచారణను వాయిదా వేశారు. తొలుత ఫిబ్రవరి 26వ తేదీన సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకున్నది.
ఢిల్లీ క్యాబినెట్ కి సిసోడియా ఫిబ్రవరి 28వ తేదీన రిజైన్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉన్నది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్తానం నిరాకరించింది.