Terror Attack | మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరే పట్టణంలో బుధవారం సాయుధ దుండగులు భద్రతా సిబ్బంది లక్ష్యంగా మెరుపు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ మణిపూర్ భద్రతా అధికారి మరణించారు. ఎస్బీఐ మోరే సమీపంలోని భద్రతా దళాల శిబిరంపై దుండగులు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఘర్షణ జరిగింది.
ఈ ఘర్షణలో భద్రతాధికారి సోమర్జిత్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పాయారని పోలీసులు తెలిపారు. కమాండో పోస్ట్‌పై మిలిటెంట్లు ఆర్పీజీ షెల్స్‌తో విరుచుకుపడటంతో సమీపంలో పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పోలీస్ అధికారిని చంపిన ఘటనలో మణిపూర్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన అనంతరం ఈ ఘటన జరగడంతో కుకీ మిలిటెంట్స్ ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. తెంగ్నౌపాల్ రెవెన్యూ పరిధిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవచ్చనే సమాచారంతో మణిపూర్ ప్రభుత్వం జనవరి 16న ఆ ప్రాంతమంతటా కర్ఫ్యూ విధించింది.
Read More :
Salt | ఉప్పు ప్రాణానికి ముప్పు.. పరిమితికి మించి వాడకంతో ఏటా 18.9 లక్షల మంది మృతి