Yumnam Khemchand : మెజారిటీ మైథీ (Meitei), మైనారిటీ కుకీ (Kuki) తెగల మధ్య దాడులు, ప్రతి దాడులతో 2023 మే నెలలో మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి మైథీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు కుకీలు, కుకీల ప్రాబల్య ఉన్న ప్రాంతాలకు మైథీలు వెళ్లే ప్రయత్నం చేయలేదు.
ఈ క్రమంలో మైథీ తెగకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యుమ్నాన్ కేమ్చంద్ సింగ్ () తెగువను ప్రదర్శించారు. దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆయన నాగా మెజారిటీ జిల్లాలైన ఉఖ్రుల్, కమ్జోంగ్లలోని కుకీ గ్రామాలైన లిటన్, చస్సాద్లలో పర్యటించారు. ఆ రెండు గ్రామాల్లోని కుకీల సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
వచ్చే క్రిస్మస్ పండుగ నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా శాంతి నెలకొనాలని అందరం ప్రార్థిద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేమ్చంద్ సింగ్ పిలుపునిచ్చారు. కాగా తైక్వాండో క్రీడాకారుడు అయిన కేమ్చంద్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన అస్సాం తైక్వాండో అసోషియేషన్ను స్థాపించారు.