ఇంఫాల్: యావత్ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మణిపూర్(Manipur) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలపై మాత్రం ఆ ఆంక్షలను మినహాయించారు. డిస్టర్బడ్ ఏరియాల్లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్, లాంపెల్, సిటీ, సింగజేమి, సేక్మాయి, లాంసంగ్, పాత్సోయి, వాంగోయి, పోరాంప్ట్, హెయిన్‌గ్యాంగ్, లాంలాయి, ఇరిల్‌బంత్, లీమాఖాంగ్, తౌబాల్, బిష్ణుపుర్, నంబోల్, మొయిరాంగ్, కాక్చింగ్, జీరిబమ్ ఉన్నాయి. ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితినే కొనసాగించనున్నారు. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు మృతిచెందినట్లు ఇటీవల ఆన్లైన్లో ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటనను ఖండిస్తూ మంగళవారం ఇంఫాల్‌లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.