న్యూఢిల్లీ, జూన్ 20: భారీ వాహనాల్ని నడిపే డ్రైవర్స్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లో తప్పనిసరిగా ఏసీ బిగించాలని, ఎయిర్కండీషనర్లను బిగించిన క్యాబిన్స్తో వాహనాల్ని తయారుచేయాల్సి వుంటుందని వాహన తయారీదారులకు ఆదేశాలు జారీచేశారు.
తాజా ఉత్తర్వులు 2025 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వేసవికాలంలో ఎండతీవ్రతను తట్టుకోవటానికి, పని ప్రదేశంలో కఠినమైన పరిస్థితుల్లో డ్రైవర్‌కు ఇదెంతగానో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.