న్యూఢిల్లీ : తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్‌ను మాటల్లో చెప్పలేం. కన్నకూతురు సంతోషంగా ఉండేందుకు తండ్రి ఏం చేసేందుకైనా వెనుకాడడు. ఏడాదిన్నరగా కూతురు దూరంగా ఉండటంతో ఆమెను చూసేందుకు తండ్రి ఏకంగా కెనడాకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గ్రాడ్యుయేషన్ డేకు ముందు కూతురు ఎదుట ప్రత్యక్షమైన తండ్రి స్టోరీని శ్రుత్వ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
ప్రత్యేకమైన రోజు కూతురుతో ఉండేందుకు ఆయన ఏకంగా ఇండియా నుంచి కెనడా వెళ్లాడు. ఈ వీడియోలో తండ్రి తన కూతురు పనిచేసే స్టోర్‌లోకి ఆమె కంటపడకుండా మెల్లిగా ఎంట్రీ ఇవ్వడం కనిపిస్తుంది. తండ్రిని చూసిన మరుక్షణం కూతురు ఆశ్చర్యంతో పాటు ఉద్వేగానికి గురవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని బోరుమని విలపించడం చూడొచ్చు.
భారత్ నుంచి కెనడా వచ్చిన తండ్రి తన కంటపడగానే ఒక్కసారి నా గుండె కొట్టుకోవడం ఆగినంత పనైంది. జీవితంలో తానెన్నడూ మరచిపోని క్షణం ఇది..డోర్ నుంచి తండ్రి రావడం చూసి పూర్తిగా షాక్‌కు గురయ్యా..ఇది అద్భుతమైన క్షణం..నన్ను చూసేందుకు నాన్న ఇంతదూరం రావడం నమ్మలేకపోయా..లవ్ యూ డాడ్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. తండ్రీకూతుళ్ల ఆప్యాయతకు ఫిదా అయిన నెటిజన్లు అనుబంధం అంటే ఇదేనని వారిపై ప్రశంసలు గుప్పించారు.
Read More :