లక్నో: తనతో సంబంధం ఉన్న మరదలు అడ్డు తొలగించుకునేందుకు బావ కుట్రపన్నాడు. ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశాడు. (Gang rape and murder) కిల్లర్స్‌కు డబ్బులు ఇచ్చేందుకు రూ.40,000 లోన్‌గా తీసుకున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెళ్లైన ఆశిష్‌కు భార్య చెల్లెలైన మరదలుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని అతడు భావించాడు.
కాగా, మరదలు హత్య కోసం ఆసుపత్రి ఉద్యోగి శుభమ్ సహాయాన్ని ఆశిష్ కోరాడు. ఆ తర్వాత మరో సహచరుడు దీపక్ వీరికి తోడయ్యాడు. రూ.30,000 ఇస్తే ఆమెను చంపుతామని వారు చెప్పారు. దీంతో ఆశిష్ రూ.40,000 లోన్ తీసుకున్నాడు. అడ్వాన్స్‌గా పది వేలు వారికి చెల్లించాడు. మరదలి హత్య తర్వాత మిగతా రూ.20,000 ఇస్తానని చెప్పాడు.
జనవరి 21న ఆశిష్, శుభమ్, దీపక్ కలిసి ఆ మహిళను స్కూటర్‌పై మీరట్‌లోని నాను కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చున్నీతో గొంతు నొక్కి ఆ మహిళను హత్య చేశారు. పెట్రోల్ పోసి ఆమె మృతదేహాన్ని తగులబెట్టారు.
మరోవైపు, మహిళ మిస్సింగ్‌పై ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయగా ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్‌తో కలిసి కనిపించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహిళ మృతదేహాన్ని కాల్చిన ప్రదేశం నుంచి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న శుభం, దీపక్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.