Punjab | వివాహిత మహిళతో సంబంధం.. యువకుడిని కొట్టి చంపిన మహిళ బంధువులు
Punjab : పంజాబ్‌లో దారుణం జరిగింది. వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు ఆమె తరఫు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Punjab : పంజాబ్‌లో దారుణం జరిగింది. వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు ఆమె తరఫు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు, బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మాన్సా జిల్లా, ఖోకర్ రోడ్‌కు చెందిన జషన్‌దీప్ సింగ్ (25) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు.
ఆ మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య సంబంధంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల నలుగురైదుగురు మగవారు, ఇద్దరు మహిళలు బొలెరో వాహనంలో వచ్చారు. అతడిని లాక్కెళ్లి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతుల ఎముకలు విరిగిపోయాయి. జషన్‌దీప్ సింగ్‌ను తీవ్రంగా కొట్టిన అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే ఆ యువకుడి కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జషన్‌దీప్ సింగ్ మరణించాడు. దీనిపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి, తండ్రి కోరారు.
ఈ అంశంపై వారు మాట్లాడుతూ.. తమ కొడుకుపై గతంలో కూడా నిందితులు దాడి చేశారని తెలిపారు. తన కొడుకుకు ఫోన్ చేయవద్దని ఆ వివాహిత మహిళకు తాము పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఆమె అలా ఫోన్ చేయడం వల్లే ఈ రోజు ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

