భోపాల్: ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు డ్రా చేశాడు. తన కుమారుడితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. వారిని అనుసరించిన దొంగ, ఆ వ్యక్తి జేబులో ఉన్న రూ.50 వేలు చోరీ చేశాడు. (Man Steals From Biker’s Pocket) తన అనుచరుడితో కలిసి మరో బైక్‌పై పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం గౌరవ్ నామ్‌దేవ్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి బ్యాంక్‌కు వెళ్లాడు. రూ.50,000 డ్రా చేశాడు. తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
కాగా, గౌరవ్ డ్రైవ్ చేస్తున్న బైక్ ఒక రోడ్డు మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లింది. అక్కడ మాటు వేసిన ఒక వ్యక్తి కదులుతున్న ఆ బైక్ వెంటపడ్డాడు. వెనుక కూర్చొన్న గౌరవ్ తండ్రి జేబులో ఉన్న రూ.50,000 చోరీ చేశాడు. మరో బైక్‌పై ఉన్న తన అనుచరుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు గౌరవ్, అతడి తండ్రి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయడాన్ని గమనించిన నిందితులు వీరిని అనుసరించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ చోరీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Caught On Cam: Pickpocket Steals Rs 50,000 From Bike Pillion Rider In Broad Daylight In Gwalior#MPNews #MadhyaPradesh pic.twitter.com/NNyD2ZXEVj
— Free Press Madhya Pradesh (@FreePressMP) March 7, 2025