Man Stabs Bus Conductor | బస్సు డోర్ వద్ద ఉండోద్దన్నందుకు.. కండక్టర్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి
Man Stabs Bus Conductor | ఒక వ్యక్తిని బస్సు డోర్ వద్ద ఉండోద్దని కండక్టర్ చెప్పాడు. బస్సు లోపలకు రావాలని అతడ్ని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కండక్టర్‌ను కత్తితో పొడిచాడు. చివరకు బస్సులో బంధీ అయిన అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక వ్యక్తిని బస్సు డోర్ వద్ద ఉండోద్దని కండక్టర్ చెప్పాడు. బస్సు లోపలకు రావాలని అతడ్ని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కండక్టర్‌ను కత్తితో పొడిచాడు. (Man Stabs Bus Conductor) చివరకు బస్సులో బంధీ అయిన అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులో ప్రయాణించిన ఒక వ్యక్తి డోర్ వద్ద ఉన్నాడు. అయితే ఆటోమేటిక్ డోర్ వద్ద ఉండవద్దని, లోపలకు రావాలని 45 ఏళ్ల బస్సు కండక్టర్ యోగేష్ చెప్పాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి తన బ్యాగ్ నుంచి కత్తిని బయటకు తీశాడు. కండక్టర్ యోగేష్‌ను కత్తితో పొడిచాడు. ఆ కత్తిని చూపించి ప్రయాణికులను కూడా బెదిరించాడు.
కాగా, ఇది చూసి ఆ బస్సులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. వారంతా బస్సు నుంచి కిందకు దిగిపోయారు. డ్రైవర్ కూడా డోర్లు లాక్ చేసి బస్సు నుంచి దిగిపోయాడు. దీంతో కండక్టర్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి బస్సులో బంధీ అయ్యాడు. బస్సు డోర్లు, అద్దాన్ని కాళ్లతో పగులగొట్టేందుకు అతడు ప్రయత్నించాడు. ఆ బస్సు వద్దకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కత్తిపోట్ల వల్ల గాయపడిన కండక్టర్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు నిందితుడు జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల హర్ష్ సిన్హాగా పోలీసులు గుర్తించారు. బీపీవో సంస్థ అతడ్ని తొలగించడంతో మూడు వారాల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఉద్యోగం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పోలీసులకు అతడు చెప్పాడు. ఆ వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
CCTV Footage Shows Bengaluru Man Stabbing Bus Conductor After Door Warning
A 25-year-old man was arrested in #Bengaluru for stabbing a #BMTC conductor after being asked to move away from the door. #cctv #bengalurucrime #knife pic.twitter.com/GccN6X66FW
— Madhuri Adnal (@madhuriadnal) October 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- Bus conductor
- MAN
- stabs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

