లక్నో: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహం వద్ద గంట సేపు కూర్చొన్నాడు. (Man Slits Wife’s Throat, Sits With Body) ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. వేర్వేరు కులాలకు చెందిన అంగద్ శర్మ, నేహా ప్రేమించుకున్నారు. వారి కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ రెండేళ్ల కిందట గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్లారు. అంగద్ అక్కడ కార్పెంటర్‌గా పనిచేశాడు.
కాగా, కొంత కాలం తర్వాత ఈ జంట గోరఖ్‌పూర్‌కు తిరిగి వచ్చింది. వాహన ఏజెన్సీలో నేహ పనిచేస్తున్నది. అయితే అర్థరాత్రి వేళ ఎవరితోనో ఆమె ఫోన్లో మాట్లాడటాన్ని అంగద్ చూశాడు. అతడితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో ఈ దంపతుల మధ్య గొడవలు పెరిగాయి.
మరోవైపు జూన్ 3న రాత్రి వేళ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహించిన అంగద్ బరువైన వస్తువుతో నేహ తలపై కొట్టాడు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. బెడ్‌పై రక్తం మడుగులోపడి ఉన్న ఆమె మృతదేహం పక్కన గంటసేపు కూర్చొన్నాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నేహ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అంగద్‌ను అరెస్ట్ చేశారు. నేహ కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: