ముంబై : ఒక్కరోజులో వేలాది మంది ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం భిన్నమైన అనుభూతులను మిగిల్చినా కొన్ని సార్లు ఫన్ రైడ్‌ను తలపిస్తుంది. ముంబై లోకల్లో ఓ వ్యక్తి లతా మంగేష్కర్ కాంతా లగా సాంగ్‌ను ఆలపించగా తోటి ప్రయాణీకులు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
సమాధి మూవీలోని ఈ సాంగ్‌ను ముంబై లోకల్లో ఓ వ్యక్తి హృద్యంగా ఆలపించడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ప్రముఖ వీడియో కంటెంట్ క్రియేటర్ కల్పేష్ రాణే ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి పాపులర్ ఓల్డ్ సాంగ్‌ను పాడుతుండగా ఇతరులు ట్యూన్స్‌కు తగినట్టు డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ముంబై వాసులు లోకల్ ట్రైన్లో గంటల కొద్దీ ప్రయాణిస్తూ గమ్యస్ధానాలకు చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రయాణీకులు అలసటకు లోనవకుండా వారిని ఉత్సాహపరిచేందుకు ఆ వ్యక్తి పాట పాడటం పలువురిని ఆకట్టుకుంది. ఈ హుషారైన ట్యూన్‌కు అనుగుణంగా వృద్ధులతో సహా ప్రయాణీకులందరూ డ్యాన్స్‌లు చేస్తూ, చప్పట్లు కొడుతూ గాయకుడిని ఎంటర్టైన్ చేశారు.
Read More :