న్యూఢిల్లీ : విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. కొన్ని వెరైటీ ఫుడ్ కాంబో వీడియోలు నెటిజన్ల నోరూరిస్తుండగా మరికొన్నింటిని చూసి వారు పెదవివిరుస్తున్నారు. తాజాగా చీజ్ చాయ్ వీడియోతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు ఇదేం కాంబినేషన్ అంటూ విరుచుకుపడ్డారు.
Tea lovers (including myself), somewhere in India they are selling Cheese Chai..
Okay, Happy Sunday🤣🤣🤣 pic.twitter.com/mdCFhsa29r
— Mohammed Futurewala (@MFuturewala) November 6, 2022
అయితే ఇందులోనూ ఓ ట్విస్ట్ దాగుండటం విశేషం. ఇది చీజ్ చాయ్ కాదని, ఫ్రెంచ్ ఆనియన్ సూప్ బౌల్ అని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. మహ్మద్ ఫ్యూచర్‌వాలా ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో చీజ్‌తో కూడిన కంటైనర్ క్లోజ్ షాట్ కనిపిస్తుండగా కంటెయినర్లో ఓ వ్యక్తి స్పూన్‌ను ఉంచగా టీ వంటి లిక్విడ్ బయటకు వస్తుండటం కనిపించింది.
అసలు తాము అమితంగా ఇష్టపడే చాయ్‌తో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారంటూ యూజర్లు కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు. చీజ్చాయ్ను భారత్‌లో కొన్నిచోట్ల అమ్ముతున్నారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకూ 70,000 మందికి పైగా వీక్షించారు.