ముంబై: ఒక చిన్నారి బాల్కానీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వెళ్లి కాపాడాడు. (Man Saves Child) ఆ బాలుడ్ని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు చేతుల్లో పడిన ఆ చిన్నారి పట్టుతప్పి ఆ వ్యక్తి కాళ్లపై పడ్డాడు. దీంతో ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం డోంబివ్లిలోని ఎత్తైన బిల్డింగ్ మూడో అంతస్తులోని బాల్కానీలో రెండున్నర ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే బాల్కానీ, గ్రిల్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి ఆ చిన్నారి కిందపడిపోయాడు.
కాగా, అటుగా వెళ్తున్న భవేష్ మాత్రే అనే వ్యక్తి దీనిని గమనించాడు. వెంటనే స్పందించి పరుగున అక్కడికి వెళ్లాడు. చాలా ఎత్తు నుంచి కిందపడుతున్న బాలుడ్ని తన చేతుల్లో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చేతుల్లోంచి జారిన ఆ బాలుడు ఆ వ్యక్తి కాళ్లపై పడ్డాడు. అతడు వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకున్నాడు. దీంతో ఆ బాలుడికి ప్రమాదం తప్పింది. అయితే భవేష్ చేతులు, కాళ్లకు నొప్పి కలిగింది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూడో అంతస్తు నుంచి కిందపడినప్పటికీ ఆ చిన్నారి సురక్షితంగా ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ పసి బాలుడ్ని కాపాడిన వ్యక్తిని ప్రశంసించారు.
A 2 year old child fell from a third-floor balcony of a 13 storey building in Dombivli.
Bhavesh Mhatre saw that and ran to catch the toddler. His intervention softened the landing and it resulted into minor injuries only and the child is safe. 🫡 pic.twitter.com/7XXCC1KmaU
— Incognito (@Incognito_qfs) January 27, 2025