Watch: ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురిపైకి దూసుకెళ్లిన కారు.. ఒక మహిళ మృతి
Man Runs Car Over | ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురిపైకి ఒక కారు దూసుకెళ్లింది. (Man Runs Car Over) ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురిపైకి ఒక కారు దూసుకెళ్లింది. (Man Runs Car Over) ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు లేడీహిల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు నడిచి వెళ్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో వారంతా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా గుర్తించారు. మరో మహిళ, ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ సంఘటన అనంతరం కారు డ్రైవ్ చేసిన కమలేష్ బల్దేవ్ ఒక కార్ షోరూమ్ ముందు తన కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#JustIn: Horror on #Mangaluru street. speeding car knocked down a 23-yr-old woman & 4 girls who were walking on footpath near LadyHill area. Woman lost her life while 4 girls sustained multiple injuries. Reports @deepthisTOI. @TOIBengaluru #Karnataka #RoadSafety #Pedestrian pic.twitter.com/msAEVAPTBf
— Niranjan Kaggere (@nkaggere) October 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

