Gujarat Election | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కాగా, ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల రోజు వివాహ ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
‘ముందు ఓటు.. తర్వాతే పెళ్లి’ అన్న రీతిలో వధూవరులు తమ అమూల్యమైన ఓటును వేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తపి జిల్లాలో ఓ వరుడు ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా పెళ్లి సమయాన్నే మార్చుకున్నాడు. ప్రఫుల్బీ అనే యువకుడి వివాహం మహారాష్ట్రలో గురువారం ఉదయం జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే అదేరోజు పోలింగ్ ఉండటంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద ప్రఫుల్బీ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. నా పెళ్లి వేడుకను గురువారం ఉదయం జరిపించేలా ముందుగా ప్రణాళిక వేసుకున్నాం. అయితే, పోలింగ్ నేపథ్యంలో వేడుకను సాయంత్రానికి వాయిదా వేసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
#GujaratAssemblyPolls | Prafulbhai More, a man whose wedding is scheduled for today casts his vote in Tapi
He says, "I urge everyone to vote, you shouldn't waste it. My wedding was scheduled for the morning but I rescheduled it for the evening, we've to go to Maharashtra for it" pic.twitter.com/q1nWt9q8k1
— ANI (@ANI) December 1, 2022
కుచ్ జిల్లాలోని భుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గల 208 పోలింగ్ కేంద్రంలో ఓ నూతన జంట తమ ఓటు హక్కు వినియోగించుకుంది. కవిత, వైభవ్ వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అదే రోజు పోలింగ్ ఉండటంతో వివాహం అనంతరం పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఈ కొత్త జంట.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరో పోలింగ్ కేంద్రంలో పెళ్లి కుమార్తె తన ఓటు హక్కును వినియోగించుకుంది. పింక్ కలర్ లెహంగాతో అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె వేడుకకు కొన్ని గంటల ముందు సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#Gujarat में अपनी शादी के मंडप से पहले मतदान केंद्र पहुंची दुल्हन
#GujaratAssemblyPolls #GujaratElections #Breaking pic.twitter.com/w2hr0IlATP
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) December 1, 2022