న్యూఢిల్లీ : కొండచిలువ ఓ వ్యక్తి మెడకు చుట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చారలు కలిగిన కొండచిలువలు ప్రపంచంలోనే పొడవైన, బరువైన పాములు కావడం విశేషం. ఈ తరహా పైథాన్‌తో వ్యక్తి చేసిన విన్యాసాలు నెటిజన్లలో భయాందోళన రేకెత్తించాయి.
నిక్ ది రాంగ్లర్ అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. తనకు తాను జంతు, వన్యప్రాణి ప్రేమికుడిగా నిక్ తన బయోలో చెప్పుకున్నాడు. ఈ షార్ట్ క్లిప్‌లో తన మెడను చుట్టుకున్న పైథాన్‌తో నిక్ కనిపించాడు. పైథాన్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని నిక్ చెప్పడంతో ఈ వీడియోపై నెటిజన్లు చికాకు పడుతూ అతడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
పైథాన్ తన స్వర పేటికను నొక్కుతుండగా కలత చెందానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసిన అనంతరం ఇప్పటి వరకూ 3 లక్షల వ్యూస్ రాబట్టింది. నీవేం చేస్తున్నావో నీకు అసలు తెలుసా అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ కంటెంట్‌తో దాదాపు చచ్చినంత పనైందని మరో యూజర్ మండిపడ్డారు.