ముంబై: ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై వివాదం చెలరేగింది. (Dispute Over Instagram Post) ఈ నేపథ్యంలో యువకుడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Kills Teen) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హింగాన్ఘాట్ ప్రాంతంలోని పింపాల్గావ్కు చెందిన 17 ఏళ్ల హిమాన్షు చిమ్నీ, 21 ఏళ్ల మానవ్ జుమాన్కే కలిసి నెల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌పై యూజర్ల నుంచి ఓట్లు కోరారు.
కాగా, ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీపై ఓటింగ్‌లో మానవ్ కంటే హిమాన్షుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చర్చించేందుకు మానవ్, హిమాన్షు శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు ఆగ్రహించిన మానవ్ తన స్నేహితుడితో కలిసి హిమాన్షుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన మానవ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.