చండీగఢ్: ఒక వ్యక్తి తన ప్రియురాలి టీనేజ్ కుమార్తెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి బైక్‌పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు. (Man kills lover’s daughter) ఆ మహిళతో కలిసి ఆమె కుమార్తె మిస్పింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంజాబ్‌లోని నవాన్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల గుర్విందర్ సింగ్‌కు ఒక మహిళతో సంబంధం ఏర్పడింది. ఆ మహిళకు చెందిన 16 ఏళ్ల కుమార్తె వీరిద్దరి సంబంధాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యలో ఆ బాలికపై అతడు పగపెంచుకున్నాడు.
కాగా, మే 29న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలిక గొంతు నొక్కి గుర్విందర్ సింగ్ హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కాడు. బైక్‌పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు తన కుమార్తె కనిపించకపోవడంతో గుర్విందర్ సింగ్‌తో కలిసి ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసింది. తన కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేసింది.
అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న బాలిక ఆ మహిళ కుమార్తె కాదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో ఆ మహిళ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలించారు. గుర్విందర్ సింగ్ తన బైక్‌పై ట్రావెల్ బ్యాగ్ కట్టుకుని వెళ్లడం కనిపించింది.
ఈ నేపథ్యంలో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. హోషియార్పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పాక్షికంగా కాలిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.