బెంగళూరు: కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలుమార్లు కరెంట్ పోయింది. దీంతో డాక్టర్లు సెల్ఫోన్స్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన వ్యక్తికి చీకటిలోనే కుట్లు వేశారు. (Stitches Under Flashlight) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫిబ్రవరి 13న బళ్లారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అతడ్ని తరలించారు.
కాగా, గాయపడిన ఆ వ్యక్తికి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కుట్లు వేస్తుండగా కరెంట్ పోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, పవర్ బ్యాకప్ లేకపోవడంతో ఆ వార్డు చీకటిమయమైంది. వైద్యులు రోగులకు చికిత్స కోసం మొబైల్ టార్చిలైట్పై ఆధారపడ్డారు. సుమారు 15 నిమిషాలపాటు అక్కడ అంధకారం కొనసాగింది.
మరోవైపు ఫిబ్రవరి 13న సాయంత్రం విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగిందని మెడికల్ సూపరింటెండెంట్ శివ నాయక్ తెలిపారు. ఆటోమేటిక్ పవర్ రిస్టోర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదని చెప్పారు. దీనిని రిపేర్ చేయడానికి 5 నిమిషాలు పట్టిందని అన్నారు. ఆ సమయంలో తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని వివరించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
This is how Our Super speciality (Trauma care) Hospital In #Ballari works
Heavy Mosquitoes,No cleaning ,Power off for every 5mins in the emergency wardಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆ ಬಡವರಿಗೆ ಅಲ್ಲ! ಮೊಬೈಲ್ ಟರ್ಚಾರ್ ಇಂದ ಎಮರ್ಜೆನ್ಸಿ ವಾರ್ಡ್ ನಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡುತ್ತಿರುವ ವೈದರೂ
It’s a serious matter pic.twitter.com/yi0DEjNiZx
— Ballari Tweetz (@TweetzBallari) February 13, 2025