మథుర: యూపీలో ఓ వ్యక్తి తన షర్ట్‌లో పాము(Snake)ను పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ ఘటన మథురలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే. ఈ-రిక్షా నడిపే దీపక్ అనే డ్రైవర్‌ను ఓ పాము కాటేసింది. అయితే అతను చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో హంగామా చేశాడు. తనకు చికిత్స చేయడం లేదని గోల చేశాడు. అయితే సిబ్బందిలో ఒకరు వచ్చి అతన్ని ఏం పాము కాటేసిందని అడిగారు. పాము ఎక్కడందని ప్రశ్నించారు. దీంతో దీపక్ తన షర్ట్‌లో దాచిపెట్టిన ఆ సర్పాన్ని తీసి చూపించాడు. షర్ట్‌లో నుంచి సజీవ పామును తీయడంతో ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురైంది. ఆ పాము దాదాపు అడుగున్నర పొడుగు ఉన్నది. పాము కాటేసి 30 నిమిషాలు అవుతోందని, కానీ ఆస్పత్రిలో ఎటువంటి సదుపాయాలు లేవని దీపక్ ఆరోపించాడు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
View this post on Instagram
A post shared by aligarhmuslimuniversity2023 (@aligarhmuslimuniversity2023)