లక్నో: ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. భూ వివాదం కారణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. (Man Hacks Parents, Sister) ట్రిపుల్ మర్డర్ విషయం తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం దిలియా గ్రామంలో దారుణ హత్యలు జరిగాయి. భూ వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ మర్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు ట్రిపుల్ మర్డర్ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Raj Thackeray Enters Matoshree | 13 ఏళ్ల తర్వాత.. తొలిసారి మాతోశ్రీలోకి అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్