High Court | ఇండోర్: ఉద్యోగం మానేయాలని, తన ఆకాంక్షలకు అనుగుణంగా బతకాలని భార్యను భర్త నిర్బంధించడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న మహిళ (33) విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
ఆమె పిటిషన్‌ను కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగం మానేసి, భోపాల్‌లో తనతోపాటు కాపురం చేయాలని తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. హైకోర్టు స్పందిస్తూ చేస్తున్న ఉద్యోగాన్ని మానేయాలని భర్త కానీ, భార్య కానీ ఒకరిపై మరొకరు ఒత్తిడి తేకూడదని స్పష్టం చేసింది.