Tamil Nadu | విషాదం.. వేడివేడి రసంలో పడి విద్యార్థి మృతి
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) లో విషాదం చోటు చేసుకుంది. వేడివేడి రసం (Vessel Of Boiling Rasam ) లో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) లో విషాదం చోటు చేసుకుంది. వేడివేడి రసం (Vessel Of Boiling Rasam ) లో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లా (Tiruvallur district)లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు (Police) తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి..
కళాశాలలో చదువుకునే 21 ఏండ్ల విద్యార్థి ఓ కేటరింగ్ సంస్థ (catering firm)లో పార్ట్‌టైం (working part-time) జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతవారం జరిగిన ఓ వివాహ వేడుక (wedding function)లో అతిథులకు వడ్డిస్తుండగా ( serving food to guests ) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థి ప్రమాదవశాత్తు అతిథుల కోసం సిద్ధం చేసిన వేడివేడి రసంలోకి పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
Also Read..
Car Hit And Drag | వ్యక్తిని కారుతో ఢీ కొట్టి మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో వైరల్
Corona India | భారీగా తగ్గిన కరోనా కేసులు.. 14 మరణాలు
Messaging Apps: 14 మొబైల్ మెసెంజర్ యాప్‌లపై నిషేధం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

