Messaging Apps: 14 మొబైల్ మెసెంజర్ యాప్‌లపై నిషేధం
Messaging Apps: మెసేజింగ్ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ జాబితాలో 14 యాప్‌లు ఉన్నాయి. కశ్మీర్‌లోయలో ఆ యాప్‌ల ద్వారా హింసను రెచ్చగొడుతున్నట్లు కేంద్రం ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న 14 మొబైల్ మేసేజింగ్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. జమ్మూకశ్మీర్‌లో ఆ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్దతుదారులతో కమ్యూనికేట్ చేసేందుకు ఉగ్ర సంస్థలు ఆ యాప్‌లపై ఆధారపడుతున్నాయి. పాకిస్థాన్ నుంచి ఆదేశాలను కూడా ఆ యాప్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. బ్యాన్‌కు గురైన యాప్‌లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమే, మీడియాఫైర్, బ్రియార్, బీచాట్, నందబాక్స్, కోనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్‌లైన్, జాంగి, త్రీమాలు ఉన్నాయి.
సెక్యూర్టీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసిన ప్రతిపాదనల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిన యాప్‌లకు చెందిన జాబితాను తయారు చేశారు. భారతీయ చట్టాలకు లోబడి లేనటువంటి యాప్‌ల చిట్టాను కూడా రెఢీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69ఏ ప్రకారం 14 రకాల యాప్‌లపై నిషేధం విధించారు. కశ్మీర్ లోయలో ఈ యాప్‌లు ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొడుతున్నాయని కేంద్రం ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

