రూ.1.5 లక్షలు ఇస్తవా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టుచేయాలా
సోషల్ మీడియా| రూ.లక్షా 50 వేలు ఇవ్వాలని, లేకపోతే తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించాడు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ముంబై: వారిద్దరు ప్రేమించుకున్నారు. రెండేండ్లపాటు కలిసి తిరిగారు. మతాలు వేరుకావడంతో వారిద్దరు ఒక్కటవ్వడానికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. మరికొన్నిరోజుల్లో వివాహం నిశ్చయం చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మాజీ ప్రేమికుడు ఎంటరయ్యాడు. రూ.లక్షా 50 వేలు ఇవ్వాలని, లేకపోతే తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించాడు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని నలాసొపరాకు చెందిన 24 ఏండ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతి (22) ప్రేమించుకున్నారు. రెండేండ్లు కలిసి తిరిగారు. అయితే విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయం చేశారు. కొంతకాలం దూరంగానే ఉన్న యువకుడు ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. తాము ఏకాంతంగా గడిపిన వీడియోలు తనవద్ద ఉన్నాయని, రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించారు. అడిగినట్టుగానే ఆ అమ్మాయి తల్లి అతనికి మొత్తం డబ్బు అప్పజెప్పింది. అయినప్పటికీ అతడు.. యువతి పెళ్లిచేసుకోబోయే వ్యక్తికి ఆ వీడియోలను పంపించాడు. దీంతో అతడు పెళ్లిని రద్దుచేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు మాజీ ప్రియుడిపై నలాసొపరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వారాంతాల్లో భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం నిలిపివేత
మీడియా టైకూన్‌కు 14 నెలల జైలుశిక్ష
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
వాషింగ్ మిషీన్ కూడా పేలిపోతుందా ?
ప్రియురాలికి నిశ్చితార్థం.. కాబోయేవాడిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
అమెరికా కాల్పుల్లో నలుగురు సిక్కులు మృతి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

