ఇప్పటివరకు సెల్ ఫోన్లు మాత్రమే పేలతాయని మనకి తెలుసు. కానీ వాషింగ్ మిషన్లు కూడా పేలిపోతాయని చెబుతోంది స్కాట్లాండ్ కి చెందిన లారా బిరెల్. ఎప్పటిలాగానే ఆరోజు కూడా బట్టలు వేసి ,నీళ్లు పోసి వాషింగ్ మిషన్ని ఆన్ చేశాను. కొంతసేపటికే పేద్ద శబ్దంతో అది పేలింది. దాని పేలుడు ధాటికి ఆ గదంతా చిందరవందర అయ్యింది. వాషింగ్ మిషన్లలోని పార్టీలన్నీతుక్కు తుక్కు అవడమే కాదు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ శబ్దానికి భయమేసిందని అయినా ధైర్యం చేసి ఆ గదిలోకి వెళ్లి వెంటనే స్విఛాఫ్ చేశానని తెలిపింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీరు వాషిన్ మిషీన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చిరించింది లారా బెరిల్.