Gujarat | అహ్మదాబాద్ : గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన భార్యను వెతికి పెట్టాలంటూ ఒక వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. స్వలింగ సంపర్కురాలైన తన భార్య అక్టోబర్‌లో తన ప్రియురాలితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిందని, ఆ సమయానికి ఆమె ఏడునెలల గర్భవతి అని ఆయన కోర్టుకు విన్నవించాడు.
దీనిపై చాంద్ఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు తన భార్య ఆచూకీని కనుగొనలేకపోయారని తెలిపాడు. కాగా, ఆమెను ఈ నెల 23లోగా తమ ముందు హాజరుపర్చాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.