ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
Man Cheats 20 Women Constables | ఒక యువకుడు రిచ్ బిజినెస్ మ్యాన్‌గా నటించాడు. విలాసవంతమైన రెస్టారెంట్లు, ఖరీరైన కార్లు వంటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒకే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఆకట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.24 లక్షల వరకు వారిని మోసగించాడు.
న్యూఢిల్లీ: ఒక యువకుడు రిచ్ బిజినెస్ మ్యాన్‌గా నటించాడు. విలాసవంతమైన రెస్టారెంట్లు, ఖరీరైన కార్లు వంటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒకే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఆకట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.24 లక్షల వరకు వారిని మోసగించాడు. (Man Cheats 20 Women Constables) ఒక మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇది తెలుసుకుని షాక్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల విక్రాంత్ తోమర్, ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించాడు. విలాసవంతమైన రెస్టారెంట్లు, కాఫీ విహారాలు, ఖరీదైన కార్లు వంటి ఫొటోలతో కూడిన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో తాను విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు.
కాగా, ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఒక మహిళా కానిస్టేబుల్‌తో విక్రాంత్ తోమర్ సహజీవనం చేస్తున్నాడు. ఆమె బ్యాచ్‌మేట్స్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్స్ సమాచారం సేకరించాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లతో అదే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఆకట్టుకున్నాడు. అద్దెకు తీసుకున్న ఖరీదైన కార్లలో వారిని షికారుకు తీసుకెళ్లేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువకుడు పలు కారణాలతో 20 మంది మహిళా కానిస్టేబుల్స్ నుంచి సుమారు రూ.24 లక్షలు వసూలు చేసి వారిని మోసగించాడు.
మరోవైపు కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మోసపోయినట్లు గ్రహించి విక్రాంత్ తోమర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె బ్యాచ్‌కు చెందిన సుమారు 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఇదే విధంగా మోసగించినట్లు తెలుసుకుని పోలీస్ అధికారులు షాక్ అయ్యారు.
అలాగే విక్రాంత్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలుసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో విక్రాంత్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడని పోలీస్ అధికారి తెలిపారు. ఒక బెట్టింగ్ యాప్‌కు అనుసంధానమైన అతడి బ్యాంకు ఖాతాలతో పాటు నిధుల బదిలీ, డబ్బు వినియోగం, ఆర్థిక పరమైన లావాదేవీలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cheats
- Delhi
- luxury cars
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

