ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన అధికారులు ముంబై విమానాశ్రయంలో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద 4 కోట్లు విలువ చేసే 700 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. ముంబై విమానాశ్రయం సమీపంలో ఉన్న కార్గో కాంప్లెక్స్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్ వద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ నడుస్తున్నట్లు సమాచారం రావడంతో ఎన్సీబీ జోనల్ యూనిట్ అక్కడ దాడులు నిర్వహించింది. 700 గ్రాములు ఉన్న హెరాయిన్ ప్యాకెట్‌ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు చెప్పారు. దాని మార్కెట్ విలువ సుమారు 4 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఘటనలో వడోదరకు చెందిన కృష్ణ మురారీ ప్రసాద్‌పై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.