Mamata Kulkarni : బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) కిన్నర్ అఖాడా (Kinner Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఇటీవల ఆమె మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా ఆ రాజీనామాను తిరస్కరించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి తన రాజీనామాను అంగీకరించలేదని ఆ వీడియోలో పేర్కొన్నారు.
అఖాడాలో కీలక స్థానమైన మహామండలేశ్వర్ హోదాను 52 ఏళ్ల మమతా కులకర్ణి పొందడంతో సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. దాంతో ఆమెపై బహిష్కరణకు వేటు పడింది. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్టు ఫిబ్రవరి 10న మమతా కులకర్ణి ప్రకటించారు. సన్యాసినిగా కొనసాగుతానని చెప్పారు. తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
రెండు రోజుల క్రితం కొందరు తమ గురువైన డాక్టర్ ఆచార్య లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందువల్లనే తాను రాజీనామా చేశానని మమతా కులకర్ణి తెలిపారు. అయితే గురువు తన రాజీనామాను ఆమోదించలేదని అన్నారు. తనను పదవిలోనే కొనసాగమన్నందుకు గురువుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. అఖాడాకు, సనాతన ధర్మ పరిరక్షణకు పునరంకితం అవుతున్నానని తెలిపారు.
Heatwaves | వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి : సందీప్ కుమార్ ఝా
Abhinav Singh | ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దు: సుప్రీంకోర్టు
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం