Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌పై చాలామంది విపక్ష నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
సామాన్యులకు ఈ బడ్జెట్లో గుండు సున్నా చూపించారు. సామాన్య ప్రజలు ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చి చివరకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఇది ఒక పెగాసస్ స్పిన్ బడ్జెట్ అంటూ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
BUDGET HAS ZERO FOR COMMON PEOPLE, WHO ARE GETTING CRUSHED BY UNEMPLOYMENT & INFLATION. GOVT IS LOST IN BIG WORDS SIGNIFYING NOTHING – A PEGASUS SPIN BUDGET
— Mamata Banerjee (@MamataOfficial) February 1, 2022