గువాహతి: అస్సాం అసెంబ్లీలో అనూహ్య పరిణామం జరిగింది. తొలి సభలో ‘మమతా దీదీ జిందాబాద్’ నినాదాలు వినిపించాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఈ నినాదాలు చేశారు. (Mamata Didi Zindabad) గురువారం అస్సాం 16వ శాసన సభ తొలి సమావేశం జరిగింది. ప్రొటెం స్పీకర్ చంద్ర మోహన్ పటోవరీ, అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారుల పర్యవేక్షణలో కొత్తగా ఎన్నికైన 126 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, అస్సాంలో టీఎంసీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్, తన ప్రమాణ స్వీకారం తర్వాత ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నినాదాలు చేశారు. ‘మమతా దీదీ జిందాబాద్’ అని సభలో అన్నారు. ఇది చూసి మిగతా సభ్యులు నవ్వుకున్నారు.
మరోవైపు మండియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన షెర్మాన్ అలీ అహ్మద్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 21న టీఎంసీలో చేరారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2021లో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైజోర్ దళ్‌లో ఆయన చేరారు. ఆ పార్టీ మాండియా ఉపాధ్యక్షుడిగా, అభ్యర్థిగా నియమితులయ్యారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్, రైజోర్ దళ్ మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. దీంతో అహ్మద్‌కు సీటు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆయన టీఎంసీలో చేరారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండియా స్థానం నుంచి పోటి చేసి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ‘మమతా దీదీ జిందాబాద్’ అని అసెంబ్లీలో చేసిన నినాదాలను టీఎంసీ ఎమ్మెల్యే అహ్మద్ సమర్థించుకున్నారు. చాలా పార్టీలు తనను నిరాకరించిన క్లిష్ట దశలో రాజకీయంగా అండగా నిలిచిన ఆమెకు బహిరంగంగా కృతజ్ఞతలు చెబుతున్నానని మీడియాతో అన్నారు. అస్సాంలో టీఎంసీని బలోపేతం చేస్తామని, నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో గట్టి అభ్యర్థిని పోటీలో నిలుపుతామని ఆయన తెలిపారు.
Honourable MLA Mr. Sherman Ali Ahmed takes his oath in the Assam Legislative Assembly echoing the sounds of “Mamata Didi Zindabad!’’
and “Jay Assam!’’After launching its major political expansion into Assam in April 2022, this Assembly Election 2026 is a major boost and… pic.twitter.com/jBdxWbucc7
— Satyaki (@satyaupdate) May 21, 2026
Also Read:
Air India Flight | నేలను తాకిన విమానం తోక భాగం.. గ్రౌండ్ చేసిన ఎయిర్ ఇండియా
Watch: సఫారీ వాహనంపై ఖడ్గమృగం దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?