కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని సీఎం మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను అర్థించారు. శనివారం కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సీజేఐ సూర్యకాంత్, ఇతర న్యాయమూర్తులు వేదికపై ఆశీనులై ఉండగా మమత మాట్లాడుతూ ‘అప్రతిష్ట పాల్జేయడానికి అనేక దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయి. ప్రజలను కాపాడండి. నా కోసం అర్థించడం లేదు. ప్రజల కోసం అడుగుతున్నా. దేశాన్ని రక్షించండి’ అంటూ నేరుగా సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులకు ఆమె విజ్ఞప్తిచేశారు.ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు జరిగిన వారం తర్వాత మమతా బెనర్జీ ఈ పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.