Mamata Benerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Benerjee) ఢిల్లీ పోలీసులపై ఫైరయ్యారు. తమ రాష్ట్ర భాష అయిన బెంగాళీ(Bengali)ని బంగ్లాదేశ్ భాష అంటూ పోలీసులు పేర్కొనడంపై ఆమె మండిపడ్డారు. లోది కల్నల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాసిన లేఖను చూపిస్తూ మమతా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. భారతీయ జనతా పార్టీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తోసి పుచ్చింది.
బంగ్లాదేశ్ భాషలో ఉన్న కొన్ని డాక్యుమెంట్లను అనువాదం చేసే క్రమంలో బెంగాలీ అని పొరపాటున రాశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మమతా ఢిల్లీ పోలీసులపై గరమైంది. ఆ లేఖ ప్రతిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. రాజ్యంగం అనుమతించని భాషతో బెంగాలీని, బెంగాలీలను అవమానించారని కేంద్రాన్ని ఆమె దుయ్యబట్టింది. ఆ లేఖను బంగా భవన్కు పోలీసులు రాశారు. సరైన ఆధారాలు లేకుండా భారత్లో నివసిస్తున్న ఎనిమిదిమంది అనుమానిత బంగ్లాదేశీయుల గురించి ఆ లేఖలో పోలీసులు పేర్కొన్నారు.
అయితే.. బెంగాలీ స్థానంలో బంగ్లాదేశ్ లాంగ్వేజెస్ అని రాశారు. ఈ విషయాన్ని మమత కావాలనే పెద్దది చేస్తున్నారని బీజేపీ అంటోంది. భాష పేరుతో ప్రజల మధ్యే విద్వేషాలు రెచ్చగొట్టాలని మమతా బెనర్జీ చూస్తున్నారని ఆ పార్టీత నేతలు కౌంటర్ ఇచ్చారు.