కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో హైడ్రామా చోటుచేసుకున్నది. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ స్ట్రాంగ్‌రూమ్‌లో బైఠాయించారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. భబానిపుర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని సాకావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న కౌంటింగ్ సెంటర్‌కు ఆమె గురువారం సాయంత్రం వెళ్లారు. సుమారు నాలుగు గంటల పాటు ఆమె స్ట్రాంగ్‌రూమ్‌లో గడిపారు. రాత్రి 12.07 నిమిషాలకు ఆమె ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థి కానీ, లేక ఓ ఏజెంట్ కానీ ఉండవచ్చు అని ఆమె అన్నారు. ఓ సీసీటీవీ ఏర్పాటుకు కూడా ఆమె ఆదేశించారు. పారదర్శకత అవసరం అని, ప్రజలు వేసిన ఓట్లను రక్షించాలని, ఫిర్యాదులు రావడంతో ఇక్కడకు వచ్చామనన, తొలుత కేంద్ర బలగాలు తన ఎంట్రీకి అవకాశం ఇవ్వలేదని, ఒకవేళ ఏదైనా ట్యాంపరింగ్ ప్రక్రియ జరిగితే, దాన్ని సహించబోమన్నారు.
స్ట్రాంగ్‌రూమ్‌లో కూర్చుకున్న మమతా బెనర్జీ వీడియోపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. స్ట్రాంగ్‌రూమ్‌లో దీదీ ఉన్నంత వరకు తమ ఎలక్షన్ ఏజెంట్ అడ్వకేట్ సుర్యానిల్ దాస్ ఉంటారన్నారు. ఎటువంటి తప్పుడు విధానాలను ఆమె అవలంబించబోదన్న ఆశిస్తున్నట్లు తెలిపారు. రూల్స్‌కు వ్యతిరేకంగా ఏం చేసినా సహించేది లేదన్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రతంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది. రూల్స్ ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. ఉదయం 5.15 నిమిషాలకు చివరి స్ట్రాంగ్‌రూమ్‌ను మూసివేసినట్లు ఈసీ తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ల కోసం సపరేట్గా స్ట్రాంగ్‌రూమ్ ఉన్నట్లు ఈసీ చెప్పింది.
ভবানীপুর নির্বাচনী এলাকা সহ সমগ্র পশ্চিমবঙ্গবাসী ভোটার ভদ্রমণ্ডলী কে আশ্বস্ত করতে চাই যে এই কেন্দ্রের তৃণমূল কংগ্রেস প্রার্থী তথা বিদায়ী মুখ্যমন্ত্রী, মাননীয়া কে কোনোরকম বাড়তি সুবিধা নেওয়া থেকে বিরত থাকতে বাধ্য করা হয়েছে।
উনি যতোই চেষ্টা চালান না কেন, কোনো রকম নিয়ম বহির্ভূত… pic.twitter.com/9hxyr3A97x— Suvendu Adhikari (@SuvenduWB) April 30, 2026