కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికలో దూసుకెళ్తున్నారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై 17వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి 45,738 వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 17వ రౌండ్ వరకూ మమతకు 67,620 ఓట్లు, ప్రియాంకాకు 21,882 ఓట్లు వచ్చాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆమె విజయం దాదాపు ఖాయం కావడంతో మమతా ఇంటి ముందు టీఎంసీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
West Bengal: TMC supporters celebrate outside CM Mamata Banerjee’s residence in Kolkata as she leads in the Bhabanipur Assembly by-election pic.twitter.com/roWsaX9moK
— ANI (@ANI) October 3, 2021