కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పాట పాడారు. బెంగాలీ భాష(Bengali language)లో ఆమె తన గాత్రాన్ని అందించారు. కోల్‌కతాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు రోజుల ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఉదయం మమతా బెనర్జీ స్వయంగా పాట(song) పాడారు. కేంద్ర ప్రభుత్వం (central government)తమకు నిధులను విడుదల చేయడం లేదని దీదీ ఆరోపించారు. పనికి ఆహారపథకంతో పాటు అనేక స్కీమ్‌లకు చెందిన నిధుల్ని(funds) కేంద్రం రిలీజ్ చేయడంలేదని ఆమె తెలిపారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty
— ANI (@ANI) March 30, 2023