కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థుల భద్రతను ప్రైవేటు కాలేజీలపైకి నెట్టేసిన సీఎం.. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో 23 ఏండ్ల విద్యార్థిని క్యాంపస్ నుంచి బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఈ ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం ‘ఆమె ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. కాబట్టి ఆమె భద్రతను ఎవరు చూసుకోవాలి? అర్ధరాత్రి 12.30 గంటలకు ఆమె బయటకు ఎలా వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఈ ఘటనను ‘షాకింగ్’గా అభివర్ణించిన మమత.. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.