ముంబాయి : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar) అకాల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కుటుంబీలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా విమాన దుర్ఘటనపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ఉదయం 8.45 గంటలకు బారమతిలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. . ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar )తో పాటు మరో 5గురు చనిపోయారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA) వెల్లడించింది.