కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ బెదిరిస్తున్నా నోరు మెదపరేం?.. మోదీని నిలదీసిన మమత.. రాజీనామాకు డిమాండ్
భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు చేసినా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహంతో ప్రశ్నించారు.
కోల్‌కతా: భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు చేసినా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహంతో ప్రశ్నించారు. కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ ప్రకటించినా మౌనంగా ఉన్న ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నదియా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ‘మోదీ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు కానీ పాక్ మంత్రి వాగుడుపై మాత్రం నోరెత్తరు.
బెంగాల్ ఎన్నికల సభల్లో ప్రధాని ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు? పాక్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఎందుకు ప్రకటించరు?’ అని మోదీ కూచ్ బెహర్ సభను ఉద్దేశించి ప్రశ్నించారు. కోల్‌కతాపై బెదిరింపులకు పాల్పడటాన్ని దేశంపై బెదిరింపులుగానే తాము పరిగణిస్తామని పేర్కొన్న ఆమె.. ‘మేము భారత్‌పై బెదిరింపులను సహించం.. అలాగే కోల్‌కతాపై కూడా’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

