కోల్‌కతా, జూన్ 17: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు. ఎటువంటి పునరావాసం కల్పించకుండా కోల్‌కతాలోని వీధి వ్యాపారులను తొలగించరాదని డిమాండ్ చేస్తూ నగరంలో భారీ నిరసన చేపట్టారు.
ప్రభుత్వ చర్య కారణంగా రోడ్డుపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వేలాది వీధి వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడతాయని మమత పేర్కొన్నారు. పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించిన తర్వాతే వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.