ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 281 పాయింట్లు కోల్పోయి 77,728.16 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ వరుసగా ఐదోరోజూ నష్టాలనే చవిచూసింది.
78.35 పాయింట్లు కోల్పోయి 24,287.65 వద్ద స్థిరపడింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడం మదుపర్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, సన్‌ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.