కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన చిత్రం ‘చిరంజీవి’. శుభసాయివెంకట్ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ మొదలైంది. కుడివైపు గుండె ఉండి, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హీరో, అతన్ని వెంటాడుతున్న ఓ గ్యాంగ్, హీరోని ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే తల్లి, ప్రియురాలు.
మరోవైపు స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో విలన్స్‌ని వెంటాడుతున్న ఓ వ్యక్తి .. ఈ నేపథ్యంలో ట్రైలర్ సాగింది. ‘వేటాడేది పులినైతే.. వేస్ట్ చేసే ప్రతి బుల్లెట్‌కూ ఒక వాల్యూ ఉంటుంది’, ‘వాడు చిరంజీవి.. చంపినా చావడు..చచ్చినా చావడు’ లాంటి డైలాగులు బాగున్నాయి. తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: శేఖర్‌చంద్ర.