రెబల్స్‌లో చీలిక.. మమతనే చైర్‌పర్సన్‌గా ఉండాలని పలువురు టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేల డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతపై తిరుగుబావుటా ఎగురవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే.
- రితబ్రత భేటీకి 32 మందే హాజరు
- రెబల్స్‌కు మమత బుజ్జగింపులు
- నేరుగా ఎమ్మెల్యేలతో మంతనాలు
- ఎంపీల్లో రాజుకుంటున్న అసమ్మతి
కోల్‌కతా, జూన్ 5 : తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతపై తిరుగుబావుటా ఎగురవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్గంలోనూ అసమ్మతి రాజుకుంటున్నట్టు సమాచారం. అసెంబ్లీ తాజాగా జరిగిన భేటీకి కేవలం 32 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్టు తెలిసింది. రితబ్రత ప్రతిపాదించినట్టు మమతను చీఫ్ అడ్వైజర్‌గా కాకుండా పార్టీ చైర్‌పర్సన్‌గా ప్రకటించాలని వీరిలో 16 మంది స్పష్టంచేసినట్టు సమాచారం. లేదంటే తాము రెబల్ వర్గంలో ఉండబోమని తేల్చిచెప్పినట్టు తెలిసింది. తమను రాజకీయంగా పెంచి పోషించింది మమతనే అని వారు స్పష్టంచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రితబ్రత నాయకత్వంలోని వర్గంలో ఏర్పడిన అసమ్మతిని అవకాశంగా మలచుకుని ఆ వర్గంలోనే తిరుగుబాటు లేవనెత్తేందుకు మమత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీఎంసీ టికెట్‌పై గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో ముస్లింలు 31 మంది ఉన్నారు. తిరుగుబాటు వర్గంలో చేరినప్పటికీ అసంతృప్తితో ఉన్న వీరిలో కొందరితో సంప్రదింపులు జరుపుతున్న మమత వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఎంపీల్లో అసమ్మతి
పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీఎంసీ ఎంపీలలో కూడా అసమ్మతి రాజుకుంటున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పలువురు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు వారు చెప్పారు. పార్లమెంట్లో విడిగా జట్టు కట్టే విషయాన్ని కూడా వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. డజనుకు పైగా ఎంపీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. టీఎంసీకి ప్రస్తుతం పార్లమెంట్లో 29 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్ట నిబంధనల కింద మూడింట రెండు వంతుల సంఖ్యాబలం ఉంటే కనీసం 22 మంది ఎంపీలు ఉండాలి. రాజ్యసభలో పార్టీకి 13 మంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందడానికి 9 మంది ఎంపీలు ఉండాల్సి ఉంటుంది.
లోక్‌సభ బరిలోకి..
లోక్‌సభలో పార్టీలో అసమ్మతి నెలకొన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ లోక్‌సభలో అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన నేపథ్యంలో తాను లోక్‌సభకు వెళ్లే విషయాన్ని ఆమె తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దిగువ సభకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకునేందుకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను తన బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఖాళీ చేయమని ఆమె కోరవచ్చని తెలుస్తున్నది. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా మమత ఉన్నారు. ప్రస్తుతం కోల్‌కతా దక్షిణగా పిలుచుకుంటున్న కలకత్తా సౌత్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

