Mallikarjun Kharge : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ఖర్గే గురువారం శ్రీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్ము కశ్మీర్లో మనం విజయం సాధిస్తే దేశమంతా మన నియంత్రణలోకి వస్తుందని అన్నారు. జమ్ము కశ్మీర్‌తో రాహుల్ గాంధీ అనుబంధం రక్తసంబంధమని ఖర్గే చెప్పుకొచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారన్న విశ్వాసం తనకున్నదని చెప్పారు. ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు నిర్ణయించాలో బీజేపీ నిర్ణయిస్తున్నదని అన్నారు. బీజేపీకి దీటైన పోటీ ఇస్తున్న పార్టీ కావడంతోనే కాషాయ పాలకులు నిత్యం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఒక్కరే బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారని అన్నారు. దేశాన్ని కాపాడటంతో పాటు మీ సంస్కృతి, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈ దిశగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఖరారు, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లడం వంటి అంశాలపైనా కసరత్తు సాగుతున్నదని సమాచారం.
Read More :
TVK | తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా ఇదే.. ఆవిష్కరించిన విజయ్